Wednesday, March 30, 2016

"చిన్నారుల" భారతం.....6


                                  .........నడుస్తున్న భాగోతం

"ఆరోజు" కార్యక్రమం తాలూకు విడియోలు బయటపడ్డాయి. "చిన్నారి" కన్నయ్య కుమార్ ని అరెస్టు చేశారు ఇంకొంతమంది తో సహా. దేశద్రోహం కేసు పెట్టారట.

ఆ వీడియోల లో ఆడియో యే మాత్రం వినిపించేలా లేదు. కారణం.....అతను మాట్లాడుతున్నంత సేపూ, ఆడియో రికార్డరు ఎదురుగా డప్పుల మోతలూ, ఇతరుల "ఓ...." అని అరుపులూ.

కొన్ని టీవీ ఛానెళ్ల వాళ్లు "తరువాత" తయారు చేసిన వీడియోలు ప్రసారం చేశారట.....వాటిలో దేశ వ్యతిరేక నినాదాలు కన్నయ్యే చేస్తున్నట్టు.

కోర్టులో ప్రదర్శించిన విడియోలు--నాయిస్ ఫిల్టర్లు ఉపయోగించి, ఆడియో మెరుగు పరచి, వినిపించినవి. (వాటిని కొందరు "డాక్టర్డ్" వీడియోలు అని కొట్టిపారేస్తున్నారు. కానీ, వాళ్లు గుండెలకి హత్తుకున్నవాళ్ల ఫోటోలని మార్చలేరుకదా? సందర్భాన్ని బట్టి, వాళ్లు ఆ ఫోటోల్లో ఉన్నవాళ్లని ఉరితీయాలి అనో, పాకిస్తాన్ తీవ్రవాదులని శిక్షించాలి అనో నినాదాలు చేస్తున్నారు అని అనుకోలేం కదా?)

కోర్టులో హాజరు పరుస్తుంటే, మళ్లీ హై డ్రామాలు...కొంతమంది లాయర్లు చేయి చేసుకున్నారు అనీ, పోలీసులు ఏమీ చెయ్యలేదు అనీ ఆరోపణలు....అవన్నీ టెలికాస్టులూ.....!

కస్టడీలు అయ్యాక, బెయిల్ ఇచ్చారు న్యాయ మూర్తి. వెంటనే, వాడు బయటికి వచ్చి, విజయోత్సవ మీటింగులూ, ర్యాలీలూ. కాంగీ, కమ్మీ మేథావులు "వాక్ స్వాతంత్ర్యం నిలిచింది" లాంటి స్టేట్మెంట్లూ, "దేశద్రోహ ఆరోపణ వాపసు తీసుకునే సూచనలు" అంటూ ఊహాగానాలూ....!

న్యాయమూర్తి యేమి చెప్పారు?

"విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో, స్వేఛ్ఛాయుత వాతావరణం లో, (కాబట్టి) ఆ వ్యక్తులు అలాంటి నినాదాలు చేయగలుగుతున్నారు. '......ఊపిరిసైతం సరిగ్గా అందని పరిస్తితుల్లో మన వీర జవానులు దేశ సరిహద్దుల్ని అనుక్షణం కాపాడు తున్నందువల్లే' తాము అలాంటి సురక్షిత వాతావరణం లో ఉన్నామని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ ఫోటోలూ తగిలించుకొని, నినాదాలు చేసినవాళ్లు, సరిహద్దుల్లో....ఒక్క గంటైనా వుండలేరు. .....ఏది పడితే అది మాట్లాడుతూ, అదే భావ ప్రకటన స్వేఛ్ఛ అనీ, అదేదో తమకు ఉన్న మౌలిక హక్కు అనీ వారు వాదిస్తే కుదరదు. .......ఇన్‌ఫెక్షన్ మరీ ముదిరిపోయి పుండుపడితే, సంబంధిత అంగాన్నే తొలగించాల్సి వస్తుంది. ఆ సమస్యకు అదే చికిత్స."

అని స్పష్టంగా చెప్పారు.

మళ్లీ మామూలుగానే, కుహనా వాదులు--'ఉత్తర్వులు ఇమ్మంటే, ఆవిడ ధర్మోపదేశాలు చెయ్యడం ఏమిటి' --అంటూ, ఆ న్యాయమూర్తిని కించ పరిచేందుకు వెనుకాడలేదు.

అసలు "జాతి వ్యతిరేకత అనేది ఏమీ 'క్రిమినల్ నేరం ' కాదు" అంటాడో న్యాయ కోవిదుడు. అంటే, కొద్ది మంది జాతి వ్యతిరేకులతో కొన్ని కోట్లమంది సహజీవనం చెయ్యవలసిందేనన్నమాట! అంతేకానీ, వాళ్లనేమీ అనకూడదు....వాళ్లని బలపడనివ్వాలి....జాతి యేమైపోయినా, కాంగీ, "కమ్మీలు" ఎలాగైనా అధికారం సంపాదించుకోవాలి!

ఇంకొంతమంది "కమ్మీలు"--వ్యవస్థ కి (తుపాకులూ, బాంబులూ, మందుపాతరలూ వగైరాలతో) శస్త్ర చికిత్స చేస్తాం" అన్నందుకే కదా "మావిస్టులనీ" వాళ్లనీ తీవ్రవాదులు అంటున్నాం? మరి ఆ న్యాయమూర్తి కూడా తీవ్రవాదేనా? అంటూ ఓ వితండవాదం మొదలెట్టారు....!!

(......మరోసారి)

2 comments:

 1. బ్లాగుశోష, శాస్త్రి గారూ. కాదేదీ రాజకీయానికనర్హం కదా.
  మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. నిజమే....నాది "శోషే" విన్నకోటవారూ!

   నా ఏజ్ గ్రూప్ వాళ్లూ, నా మిత్రులూ, మేధావులూ, భగవద్గీత, పురాణాలు వగైరాలలోని ధర్మ సూక్ష్మాలూ వగైరా విప్పి చెప్పేవాళ్లూ కూడా.....వాళ్లని "చిన్నారులు" అనీ, రోహిత్ ది "కులవ్యవస్థ చేసిన హత్య" అనీ వ్యాఖ్యానించి, సానుభూతులు ఒలకబోస్తుంటే....దుగ్ధ తో ఇవి వ్రాయడం మొదలుపెట్టాను. ఇప్పటివరకూ వాళ్లెవరూ వ్యాఖ్యానించ లేదు....ఖండించ లేదు!

   చూద్దాం......పూర్తయ్యాకైనా మాట్లాడతారేమో.....!

   మీకు నా ధన్యవాదాలు.

   Delete