haaram logo

Monday, November 27, 2017

ఆణి ముత్యాలు కావాలి....

"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- 1

అన్నం వండాలంటే, బియ్యం లోంచి వీటిని ఏరి పారెయ్యాలి! అలాగే మన వ్యవస్థ లోంచీ....!

ఎందుకు చెప్పొచ్చానంటే, ఇన్నేళ్లనుంచీ రైళ్లలో, విమానాల్లో ప్రయాణిస్తున్నానుగానీ, మనం భోజనం ఆర్డర్ ఇచ్చాక, ఆ ట్రే మన మొఖాన్న పారేసి పోతారు.....తిన్నా, తినక పోయినా మీ ఇష్టం అంటూ! పెట్టింది ఎలా వుంది, ఇంకేమైనా కావాలా అని అడిగిన పాపాన పోయినవాడు ఎవడూ లేడు. నిజంగా ఎవరైనా అలా అడిగితే ఎంత బాగుంటుంది?! నాకైతే, అలా అడిగినవాళ్లని కౌగిలించుకోవాలనిపిస్తుంది. 

మొన్న రాజధానీ ఎక్‌స్ప్రెస్ లో, ఐ ఆర్ సీ టీ సీ కేటరింగ్ అబ్బాయి డిన్నర్ ట్రే లు మామూలుగానే పంచిపెట్టాడు. దాదాపు పూర్తిగా తినే లోగానే, మళ్లీ వచ్చి, అందరినీ అడిగాడు....."సార్! ఇంకేమైనా కావాలా....రొట్టెలుగానీ, అన్నం గానీ...." అంటూ!

అతని పేరు "హరి ఓమ్"! దిగే ముందు అతనికి విషయం చెప్పి, షేక్ హాండ్ ఇచ్చి, తగినంత టిప్ కూడా ఇచ్చాను.

వడ్లూ, బెడ్డలూ ఏరి పారేసిన తరువాత మిగిలే నిఖార్సైన బియ్యం గింజలలో ఒకడు అతను.

అలాంటివాళ్లే కావాలి దేశానికి!

2 comments:

  1. నిజం. చేసే పని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. మీరు అతన్ని అభినందించటం సరియైన కితాబు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు అన్యగామి గారూ.....! ముఖ్యంగా మీ పేరు నచ్చింది.

    ReplyDelete