haaram logo

Monday, December 26, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......5

ఆర్బీఐ పారదర్శకత.....

(మొన్నటి టపా తరువాయి)

మొన్న ఓ పెద్దాయన--అదే....నిపుణుడు, టీవీలో, "బ్యాంకులవాళ్లని ఏటీఎం లలో ఎందుకు నగదు ఉంచటం లేదు? అని అడిగితే, ఏటీఎం లలో పెడితే, అన్ని బ్యాంకుల ఖాతదారులూ తీసుకుంటారు, మా శాఖ అయితే, మా ఖాతాదారులకే ఇవ్వచ్చు. మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా? అన్నారు" అని చెప్పాడు. మరి అలాంటి ఆదేశాలు ఎవరు ఇచ్చారు? అని ఆయన అడగాలేదు, వాళ్లు చెప్పాలేదు....అని ఓ దురభిప్రాయం కలగాలి చూసేవాళ్లకి!

ఇప్పుడు కావలసింది, వీలైనంత ఎక్కువ నగదు చెలామణీ లోకి రావాలి. పరిమిత మొత్తాల్లో, ఎక్కువమంది ద్వారా నగదు చెలామణీ లోకి రావాలి అంటే, ఏటీఎం ల వల్లే సాధ్యం.....అనే చిన్న నిజాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? అలా ఎందుకు ఒప్పుకోరు?

20-12-2016 నాటికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఙ్ఞానోదయమయ్యిందో గానీ, ఆంధ్రా బ్యాంకు లో వారానికి 24,000 చొప్పున, అంతకు లోబడి, అడిగినవారికి అడిగినంత వితరణ చేశారు! ఏటీఎం లో కూడా నగదు వుంచారు.....2 గంటల్లో ఖాళీ అయ్యింది. 

పూర్వం నేను పనిచేసిన శాఖలో ఆ రోజు, ఒక 60 మంది రూ.24,000/-; దాదాపు 200 మంది అంతకు లోపు నగదు తీసుకోగలిగారు! 

స్టేట్ బ్యాంకులో ఆ రోజుకూడా నగదు లేకపోయినా, ఊళ్లో నగదుకొరత లేకుండా పూర్తిగా చెలామణీ జరిగింది!

21 వ తేదీ నుంచి, దాదాపు మా ఊళ్లో అన్ని బ్యాంకుల్లోనూ, అధిక శాతం ఏటీఎం లలోనూ నగదు వితరణ బాగానే జరుగుతోంది!

"50 రోజులు" కన్నా ముందే, ఎవరు ఎంత అరిచిగీపెట్టినా, నగదు కష్టాలు తీరిపోతున్నట్టే! 

ఇంక, ఆర్బీఐ పారదర్శకత.....సంగతి.....!

ఆర్బీఐ గత 90 యేళ్లనుంచీ చేస్తున్న పనే--నగదు ముద్రణా, పంపిణీ--ఇప్పుడూ చేస్తోంది! ఆ విషయం మన సోకాల్డ్ నిపుణులు వారికి నేర్పఖ్ఖర్లేదు.....సలహాలు ఇవ్వ వలసిన అవసరం లేదు. 

ఆర్బీఐ కి ఈ విషయం లో "పారదర్శకత" (అంటే, మీడియావాళ్లకి ప్రతిరోజూ బులెటిన్లు విడుదల చేయడం) పాటించవలసిన అవసరం లేదు!

స్థూలంగా, గత వారాల్లోనూ, నెలల్లోనూ ఏ బ్యాంకు నుంచి ఎంత నగదు చెలామణిలోకి వచ్చింది, ప్రస్తుతం ఎంత అవసరం వుంటుంది అనే లెఖ్ఖల మీద ఆథారపడి, బ్యాంకులకి నగదు పంపిణీ జరుగుతుంది. (ముఖ్యంగా....యే రాష్ట్రానికి ఎంత? అనే ప్రశ్నే రాదు! ఆ బాధ్యత ఆ బ్యాంకు యాజమాన్యాలదే! యూపీ ఎలక్షన్లొస్తున్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ నగదు పంపిణీ చేస్తున్నారు.....లాంటి ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదం!)

ఇప్పుడు, ఇదివరకు కన్నా చాలా వేగంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నగదు వితరణ జరుగుతూంది. కొన్ని నిబంధనలు కూడా సడలించి మరీ చేస్తున్నారు. 

(వివరంగా వ్రాయమంటే ఇంకోసారి వ్రాస్తాను.)

ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్బీఐ మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లు......మూర్ఖులు!

4) సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(......మరోసారి)

3 comments:

  1. ఆసక్తికరమైన పాయింట్లతో విశ్లేషణ చేస్తున్నారు.
    మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శాస్త్రి గారు.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం విన్నకోటవారూ! నా బ్లాగ్ మిత్రులకి కూడా ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు అందజేశాను. కానీ, మీకు--కొంచెం ఆలస్యంగా శుభాకాంక్షలు!

      ఇవాళ, నా "కృష్ణశ్రీ స్వగతాలు" లో టపా ప్రచురించాను. చదివి, మీ అమూల్యాభిప్రాయాన్ని అందించండి!

      Delete
  2. ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు
    మీరన్నట్టుగా క్యూలు తగ్గిపోయాయి, ౫౦౦ నోటూ చలమణీలోకొచ్చేసింది. ఎక్కడేనా ప్రత్యేక పరిస్తితులున్నాయేమో తెలీదు.

    ReplyDelete