haaram logo

Thursday, January 12, 2017

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......6


సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(మొన్నటి టపా తరువాయి)



అసలు "సరైన ప్రత్యామ్నాయం" అంటే ఏమిటి? అది దేనికి అవసరం? ఈ విషయాన్ని ఏ నిపుణుడూ వివరించలేదు!

వాళ్ల ఉద్దేశ్యం......రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానం లో మళ్లీ అవే నోట్లు ప్రవేశ పెట్టాలి అనా? లేదా, పాత నోట్లు మార్చుకోవలసిన అవసరం లేకుండా, కొత్త నోట్లు ప్రవేశ పెట్టవలసింది అనా? ముందు, ఏటీఎం లు అన్నింటిలోనూ కొత్త నోట్లు నింపేసి, అప్పుడు పాతనొట్లు రద్దు చెయ్యవలసింది అనా? మరేమైనానా? ఏమనుకోవాలి మనం వీళ్ల "నిపుణత"ని?

పైన చెప్పినవాటిలొ ఏది చేసినా, రహస్యం వెల్లడి అయ్యేది! నల్లధనం మొత్తం మాయం అయ్యేది.....మరిన్ని రూపాల్లో! అందుకే హఠాత్తుగా ప్రకటించడం.

1978 లో, 10 వేలు, 5000 నోట్ల రద్దు చేసినప్పుడు--ప్రత్యామ్నాయాలు అసలు లేవు! మార్పిడి అనుమతించబడలేదు! ఏటీఎం లు లేవు! కొత్తగా మరిన్ని చిన్న నోట్లు విరివిగా జారీ చెయ్యడం......లేదు! కేవలం ఆ నోట్లని, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమే.....రద్దు నుంచి రక్షణ....అదీ, పూర్తి వివరాలు ధృవీకరణ పత్రం లో వ్రాసి, సంతకాలు చేశాక!

మరి ఈ సారి అలా ఎందుకు చెయ్యలేదు.....అంటే, అప్పట్లో చెలామణీ లో ఉన్న నోట్లే, తక్కువ. వాటిలో 10000 నోట్లు , 5000 నోట్ల కంటే చాలా, చాలా తక్కువ! అందుకే, 10 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నారు. 5 వేల నోట్లు పెద్ద సంఖ్యలోనే డిపాజిట్ చేసుకున్నారు. మిగిలినవాటిని, వివరాలు చెప్పలేనివాటిని, సిగరెట్లూ, కుంపట్లూ వెలిగించడానికి ఉపయోగించుకున్నారు!

ఇప్పుడు, అప్పటి కన్నా కొన్ని వేల రెట్లు నోట్లు చెలామణీ లో ఉన్నాయి. అందుకే, మార్పిడి! ఆ మాత్రానికి సంతోషించాలి అందరూ.

(ఇప్పుడు, అన్ని చోట్లా, ఏటీఎం ల ముందు క్యూలు లేవు, బ్యాంకుల్లో పరిమితికి లోబడి, అందరికీ కోరినంత నగదు అందుతూంది! డిజిటల్ లావాదేవిలు పెరిగాయి! ఆ టీవీల, నిపుణుల నోళ్లు మూతపడ్డాయి!)

(......మరోసారి)

3 comments:

  1. ఎవడండీ నిపుణుడు!? కాంగీ/కామీ గాళ్ళు ఆ ముసుగేసుకుని అవాకులూ చవాకులూ వాగి వాగి నోళ్ళు పడిపోయి ఉన్నారు ప్రస్తుతానికి. ఇలా వాగినవాళ్ళు అసలైన నిపుణుల పరువుతీశారు.

    ReplyDelete
    Replies
    1. నిజం మరోసారి నొక్కి చెప్పారు శివ గారూ!

      ధన్యవాదాలు!

      Delete