Monday, September 5, 2016

"వినాయక చవితి"

వినాయక ప్రార్థన

సాధారణంగా ఏ పని అయినా వినాయక ప్రార్థనతో ప్రారంభించడం మన భారతీయుల అలవాటు.

"వినాయక చవితి" చిత్రం లో ఘంటసాలవారు పాడిన ఆ ప్రార్థన, అదే ఒరవడిలో, ఇప్పటికీ అందరూ పాడతారు!

అయితే, ఆయన ఏ ముహూర్తంలో అలా పాడాడో, అలా రికార్డు అయ్యిందో గానీ, "శుక్లాం.....బరధరం....." అని ఉంటుంది....అలాగే పాడతారు అందరూ!

కానీ, అసలు "శుక్లాంబర.....ధరం, విష్ణుం" అని పాడాలి.

అదృష్టవశాత్తూ, "అగజానన పద్మార్కం....." పద్యాన్ని, చక్కగా అర్థయుక్తంగా పాడాడు.....అందరూ అలా కొనసాగిస్తున్నారు.....చాలా సంతోషం!

సంస్కృతం లో తు, చ అనే అక్షరాలు యెంతో ముఖ్యమైనవి. అందుకే తు చ తప్పకుండా ఆచరించాలి అంటారు.

మన బాలసుబ్రహ్మణ్యం మాత్రం, "వక్రతుండ, మహాకాయా, సూర్యకోటి సమప్రభా, నిర్విఘ్నం.....కురుమేదేవా...."! అని పాడేశాడు. నిర్విఘ్నం తరవాత "తు" ఎగిరిపోయింది!

దాంతో, తరువాత, "కురుం ఏ దేవా" అన్నది కలిసిపోయి, కురుమ....అంటే "కుమ్మరి" అనే అర్థం ధ్వనిస్తుంది!

మరి, ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారో మన గాయకులూ, విద్వాంసులూ, సినిమావాళ్లూ!

4 comments:

 1. మీ బ్లాగ్ ని మీరే పట్టించుకోవడం లేదల్లే ఉందే! చాలా కాలమైంది మీరు టపా వ్రాసి. ఈ నోట్లరద్దు గురించి అయినా తప్పక వ్రాస్తారనుకున్నాను (అందులోనూ మీరూ బ్యాంక్ ఉద్యోగం చేసారు కాబట్టి). అంతా కుశలమేనా?

  ReplyDelete
 2. ప్రియమైన విన్నకోటవారూ!

  బ్లాగ్ ఏగ్రిగేటర్లు.....ముఖ్యంగా హారం లాంటివాళ్లు మూసేసిన తరవాత, బ్లాగుల "రీచ్" తగ్గిపోయింది. ఎవరో మీలాంటి వాళ్లు తప్ప వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

  ఫేస్ బుక్ లో, నా టైం లైన్ లోనూ, నా పేజీ లోనూ, ఇంకో నా గ్రూప్ లోనూ దాదాపు ప్రతిరోజూ వ్రాస్తూనే వున్నాను.

  దానిలో ఇంకో సౌలభ్యం యేమిటంటే, ఫేస్ బుక్ లో టపా ప్రచురించగానే, ఆ టపా గూగుల్+ లోనూ, ట్విట్టర్ లోనూ కూడా ప్రచురించబడుతుంది. దాంతో, "రీచ్" పెరుగుతోంది.

  అదే, బ్లాగు లో వ్రాసి, ఆ లింక్ ఫేస్ బుక్ లో షేర్ చేస్తే, ప్రత్యేకంగా ఆ లింకుని తెరిచి చదివే ఓపిక కూడా ఉండడం లేదు ఫేస్ బుక్ లో వాళ్లకి!

  అది తప్ప వేరే కారణం లేదు.

  పెద్దనోట్ల రద్దు గురించి వ్రాస్తూనే ఉన్నాను. దయచేసి, ఈ క్రింది లింకులలో నా టపాలు చదివి, మీ అమూల్యాభిప్రాయాలని చెప్పండి.

  1. https://www.facebook.com/groups/1311091748908538/

  2. https://www.facebook.com/Ammanamanchi-Krishna-Sastry-357252771054612/

  3. https://www.facebook.com/krishna.sastry.79

  ఎప్పటికీ మీ,

  కృష్ణ శాస్త్రి

  ReplyDelete
 3. వెంటనే జవాబిచ్చినందుకు, లింకులిచ్చినందుకు ధన్యవాదాలు కృష్ణ శాస్త్రి గారూ.
  మీ పాయింట్ అర్ధమైంది కానీ నేను Facebook ఖాతాదారుడిని కాదు. చేరే ఆసక్తి కూడా లేదు. నాలాంటి వారు మరి కొంత మంది కూడా ఉండే ఉంటారు. మీరన్నట్లు సోషల్ మీడియా లో "రీచ్" ఎక్కువే ఉంటుందేమో కాదనను, కానీ ....అదే చేత్తో ....అదే వ్యాసాన్ని....మీ బ్లాగ్ లో కూడా.... వేసేస్తే నాలాంటి బ్లాగుమాత్ర పాఠకులు కూడా చూడగలుగుతారు, తద్వారా "రీచ్" మరి కాస్త పెరుగుతుందే కాని నష్టమేమీ ఉండదని నా అభిప్రాయం. ఆలోచించండి.

  ReplyDelete
 4. మా విన్నపంపై మీ తరువాతి టపా (17-12-2016) మీ బ్లాగులో కూడా ప్రచురించినందుకు థాంక్స్ కృష్ణ శాస్త్రి గారూ. కొనసాగిస్తారని ఆశిస్తాను.

  ReplyDelete