.........నిరర్ధక ఆస్తులూ
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరర్ధక ఆస్తులు 3 నెలల్లో ఒకేసారి యెక్కువగా పెరిగినట్టు "చూపించడం" తో ఆ బ్యాంకు సీ ఎం డీ బలి కావాలసి వచ్చింది.
అసలు ఈ నిరర్ధక ఆస్తుల గుర్తింపే ఓ గందరగోళం. పైగా వాటివల్ల యెవరికీ ఏ ఉపయోగం లేదు--బ్యాంకుల షేర్ హోల్డర్లనీ, రిజర్వ్ బ్యాంకునీ, స్టాక్ మార్కెట్ నీ మోసం చెయ్యడం తప్ప. యెందుకంటే..........
అసలు వాటి గుర్తింపు, తగిన జాగ్రతా చర్యలు తీసుకోవడం, అవి వసూలు కాకపోతే బ్యాంకు లాభ నష్టాల ఖాతాలో తగిన "ప్రావిజన్" లు పెట్టడం విషయం లో ఓ విధానమంటూ మొదలయ్యాక, దాని కోసం ప్రతీ బ్యాంకూ వాళ్లిష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలెట్టాయి. అప్పట్లో వివిధ స్థాయిల అధికార్లకీ ఈ నిరర్ధ్హక ఆస్తులు యెంత తక్కువగా చూపిస్తే, అంత గొప్ప. దాంతో, నానా కష్టాలూ పడి, సం వత్సరాంతం లో జరిగే "ఆడిట్" కి వచ్చే ఆడిటర్లని మేనేజ్ చేసుకొని, వీలైనన్ని నిరర్ధక ఆస్తులని చాపక్రింద తోసేసేవారు.
ఓ ఐదారు యేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కొద్దిగా కళ్లెర్రజేయడంతో, వీటిని పెంచి చూపించడం మొదలెట్టారు. అదీ దశలవారీగా. కానీ యెన్నాళ్లు దాగుతాయి?
బ్యాంకులు సంక్షోభం యెదుర్కోకుండా అందించిన అస్త్రం రీ షెడ్యూల్ మెంట్. అంటే, ఋణం ఇచ్చేటప్పుడు యెన్ని వాయిదాలలో తిరిగి చెల్లించాలి, వడ్డీ యెలాకట్టాలి, అపరాధ వడ్డీ యెంత? లాంటి నిబంధనలు విధిస్తారు కదా? అలా చెల్లించలేని ఖాతాలు నిరర్ధక ఆస్తులు అయిపోతాయి. అందుకని, నిబంధనలు మార్పు చేసి, చెల్లించవలసిన వాయిదాలని పెంచడం, మొదటి వాయిదా చెల్లింపుని వీలైనంత దూరం జరపడం, అపరాధ వడ్డీ ముదరా.....ఇలా చేసి, హమ్మయ్య! ఇది నిరర్ధక ఆస్తి కాదు అని నిట్టూర్చడం!
రికార్డుల కోసం ఋణగ్రహీతలకి నోటీసులు ఇచ్చినట్టూ, వారి అంగీకారంతోనే నిబంధనలు మార్చి, ఋణాన్ని రీ షెడ్యూలు చేసినట్టూ పుస్తకాల్లో వ్రాసేస్తారు. ఆక్కడనుంచీ, 10 వేల రూపాయల చిన్న ఋణం నుంచీ కోట్ల రూపాయల ఋణాల వరకూ (వీటిని టెరమ్ లోన్లు అంటారు) రీషెడ్యూల్ చేసేస్తారు. అలా యెన్నాళ్లు? ఆడిటర్లు ఒప్పుకొన్నన్నాళ్లూ!
ఇంకో నిబంధన యేమిటంటే, ఓ ఋణ గ్రహీత కి అనేక లిమిట్ లు ఉండొచ్చు. (ఓపెన్ లోన్, కీలోన్, టెరమ్ లోన్, బిల్ డిస్కవుంట్ లిమిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గోల్డ్ లోన్, గ్యారంటీలు--ఇలా) వాటిలో యే ఖాతా నిరర్ధక ఆస్తి గా మారే అవకాశం వున్నా, అప్పుడు ఆ ఆస్తిలో ఈ అన్ని లిమిట్ ఖాతాల లోనూ చెల్లించవలసిన నిలవలనీ కూడా నిరర్ధక ఆస్తులుగానే ప్రకటించాలి.
దీనికోసం బ్యాంకులు అనుసరించే పాధ్ధ్హతి--బ్యాంకులో యే ఖాతా తెరవాలన్నా, ఖాతాదారు వివరాలతో ఓ కోడ్ ఎలాట్ అవుతుంది కంప్యూటర్లో. అందుకని, వేరే వేరా ఖాతాలకి అవే వివరాలతో వేరే వేరే కోడ్ లు సృష్టించడం. దాంతో, ఫలానా కోడ్ తో వున్న ఖాతాలు చూపించమంటే, ఒక్క ఖాతానే చూపిస్తుంది కంప్యూటర్ మరి! మరి పై నిబంధనని తుంగలో తొక్కినట్టే కదా?
కొన్నేళ్ల క్రితం కొద్దిగా మార్పు వచ్చింది. కొత్తగా వచ్చిన సీ ఎం డీ నిరర్ధక ఆస్తులని యెక్కువగా చూపించి, ఆయన హయాం లో అవి తగ్గిపోయినట్టు చెప్పి, షేర్ వాల్యూ ని పెంచుకున్నారు. ఇంకా తరవాత రిజర్వ్ బ్యాంక్ సంకేతాలతో, స్టేట్ బ్యాంక్ సీ ఎం డీ, నిరర్ధక ఆస్తులని వీలైనంతవరకూ దాపరికం లేకుండా ప్రకటించాలని ఆదేశించడంతో, అవి విపరీతంగా పెరిగాయి. (ఆయన అదృష్టం కొద్దీ బలి అవలేదు). ఇతర బ్యాంకులు కూడా కొంత మారాయి. ఇప్పుడు యునైటెడ్ బ్యాంకు పరిస్థ్హితి చూస్తే, వాళ్లు మారలేదు అని తెలుస్తోంది. ఫలితమే ఆవిడ రాజీనామా!
మిగతా మరోసారి.......
No comments:
Post a Comment