Saturday, May 12, 2012

తెలుగు సెలబ్రిటీలూ.............వాణిజ్య ప్రకటనలూ

వెనకటికి మా అన్నగారిలాంటి ఒకాయన "అసలు కిత్తాత్తమి అంటే......" అంటూ అంతకుముందు హిట్ అయిన తన సినిమాలోని మేనరిజం ను అనుకరిస్తూ, ప్రకటనల్లో నటించారు.  అది ఓ సిమెంటు కంపెనీదో యేదో. బాగనే వుంది అని సంతోషించాము. (తరవాత ఆయనతో ప్రకటనల జోలికి యెవరూ వెళ్లినట్టులేదు). 

సాధారణంగా, పెద్ద కంపెనీలు సెలెబ్రిటీలని తమ వుత్పత్తులని అమ్ముకోడానికి ప్రకటనలకి వాడుకొంటూ వాళ్లకీ కొంత సొమ్ము చెల్లిస్తూండడం పరిపాటి అయిపోయింది. 

కొండొకచో అది కోట్ల రుపాయలు దాటి, బ్రాండ్ అంబాసిడర్లు లాంటి కొత్త పేర్లతో చెలామణి అయిపోతోంది. 

మరి ఆ ప్రకటనలు చూసేవాళ్లమాటేమిటి? బిగ్ బీ చెప్పాడనో, షారుఖ్, హృతిక్, సల్మాన్ వగైరాలూ, సచిన్ లాంటివాళ్లూ--వాళ్లు చెప్పారని అవన్నీ కొనేస్తారా? వాళ్లని తమ కుటుంబ సభ్యులతో ఐడెంటిఫై చేసుకొని, అనుసరిస్తారా?

యెప్పుడూ జరగదు. 

అదే మన తెలుగులో, చిరంజీవి, బాల కృష్ణ లాంటివాళ్లని తమ అన్నలుగా, ఇంకొంతమంది పెద్దవాళ్లని బాబాయిలుగా, మామయ్యలుగా, ఇతర బంధువులుగా భావిస్తారు. చిరంజీవి "కూల్ కూల్" అంటే, అది ప్రయత్నించినవాళ్లు కోకొల్లలు!

మరి వీళ్లకి ఈ ప్రకటనల్లో పాల్గొనడం అత్యవసరమా? వాళ్లకి అప్పటికే చక్కని ప్రతిష్ట వుంది. డబ్బు వుంది. ఆదరణ వుంది. మరి ఇంక దేనికోసం ఈ చిలక్కొట్టుళ్లు?

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనో, ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి అనో భావించొచ్చు. తమకి చాలా సన్నిహితులైన స్నేహితులో, బంధువులో యెవరో, లేదా ఇతర రకాల వొత్తిళ్లు వచ్చాయనో సమర్థించుకోవచ్చు. కానీ, వాటిని తట్టుకోలేరంటే మనం నమ్మగలమా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ల ప్రచారం అంత అవసరమా?

గరికపాటివారూ, చాగంటివారూ ఫలానా "వుల్లి బ్రదర్స్" వారి జరీ పంచెలూ, కండువాలూ మాత్రమే కొనండి అని ప్రకటనల్లో నటిస్తే.............!!??

పాపం గుమ్మడివారిని అదేదో గొర్రెల ఫారం వాళ్లు ప్రకటనల్లో వుపయోగించుకొని, కొన్ని షేర్లు అంటగట్టి, తరవాత ఆయన్ని తొలగించి, బాగా సంపాదించుకొని బోర్డు తిప్పేశారని, ఆయన ఆ మనో వ్యధతోనే వెళ్లిపోయాడనీ అంటుంటారు. 

మన బాబాయిలూ, మామయ్యలూ, అన్నలూ ఇలాంటివాటికి దూరంగా వుంటే బాగుంటుందని అనుకునే తెలుగువాళ్ల అభిప్రాయాలని వీళ్లు గమనిస్తే బాగుండును.

మీరేమంటారు?

6 comments:

 1. sir ak gaaru,namaste!
  ఏలే వున్నారండి?
  అన్నీ రకాల బాగుంది ఈ కక్కుర్తి వెధవలు, ads ను కూడా పోనివ్వడం లేదు.ఏదో వాటిని నమ్ముకొని బ్రతికే వాళ్ళను కూడా బ్రతకనివ్వటం లేదు.
  ఈ విషయమై నా ఫ్రెండ్ బ్లాగ్ -స్పందన లో ఓ పోస్ట్ పెట్టాడు ,చూసి స్పందించగలరు.

  ReplyDelete
  Replies
  1. డియర్ Hari Podili!

   "విషయం" మీద సూటిగా, నిర్మొహమాటంగా వ్యాఖ్యానించండి.....కానీ, ఇతరుల మనోభావాలని దెబ్బతీసే వ్యాఖ్యలూ, తిట్లూ వద్దు. అలాంటి వాటితో మొన్నటివరకూ "బ్లాగు లోకం" కంపు కొట్టేది. (ఇప్పుడే కాస్త తగ్గిందని నా భావన).

   యెవరి ఇబ్బందులూ, ఒత్తిళ్లూ వాళ్లకి వుంటాయి అని యెందుకు అనుకోరు? నేను ఓ సలహా ఇచ్చానంతే.

   ఆ పోస్ట్ కి లింకు ఇవ్వండి.

   ధన్యవాదాలు.

   Delete
  2. a k sastry gaaru,

   ఆ పోస్ట్ కు లింక్-http://spandinchaalani.blogspot.in/


   ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని కాదు నా ఉద్దేశ్యం. వాటి మీద బ్రతికేవాళ్ళకు
   కష్టం కదా!

   Delete
  3. డియర్ Hari Podili!

   మొత్తానికి ఆ లింకుతో 2-2-2012 నాటి టపాని వెతికిపట్టుకొని చదివాను.

   సంతోషం.

   Delete
 2. అయ్యా నమస్కారం,
  మీ బ్లాగులోకి యస్సార్ రావు గారి(శిరాకదంబం బ్లాగులోకి)వస్తే ఒకదాన్నుంచి మరొకటి ఆ మరొకటి నుంచి వేరొకటీ ఇలా వెళ్ళిపోతాను అందుకే ఇలా అరుదుగా కనిపిస్తున్నా మీకు

  ReplyDelete
  Replies
  1. డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!

   నమోవాకాలు.

   శిరాకదంబం ప్రక్కన నా బ్లాగుని చేర్చారంటే.......సంతోషం పట్టలేను.

   అరుదుగానైనా తళుక్కున మెరుస్తున్నందుకు ధన్యవాదాలు.

   Delete