వినాయక ప్రార్థన
సాధారణంగా ఏ పని అయినా వినాయక ప్రార్థనతో ప్రారంభించడం మన భారతీయుల అలవాటు.
"వినాయక చవితి" చిత్రం లో ఘంటసాలవారు పాడిన ఆ ప్రార్థన, అదే ఒరవడిలో, ఇప్పటికీ అందరూ పాడతారు!
అయితే, ఆయన ఏ ముహూర్తంలో అలా పాడాడో, అలా రికార్డు అయ్యిందో గానీ, "శుక్లాం.....బరధరం....." అని ఉంటుంది....అలాగే పాడతారు అందరూ!
కానీ, అసలు "శుక్లాంబర.....ధరం, విష్ణుం" అని పాడాలి.
అదృష్టవశాత్తూ, "అగజానన పద్మార్కం....." పద్యాన్ని, చక్కగా అర్థయుక్తంగా పాడాడు.....అందరూ అలా కొనసాగిస్తున్నారు.....చాలా సంతోషం!
సంస్కృతం లో తు, చ అనే అక్షరాలు యెంతో ముఖ్యమైనవి. అందుకే తు చ తప్పకుండా ఆచరించాలి అంటారు.
మన బాలసుబ్రహ్మణ్యం మాత్రం, "వక్రతుండ, మహాకాయా, సూర్యకోటి సమప్రభా, నిర్విఘ్నం.....కురుమేదేవా...."! అని పాడేశాడు. నిర్విఘ్నం తరవాత "తు" ఎగిరిపోయింది!
దాంతో, తరువాత, "కురుం ఏ దేవా" అన్నది కలిసిపోయి, కురుమ....అంటే "కుమ్మరి" అనే అర్థం ధ్వనిస్తుంది!
మరి, ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారో మన గాయకులూ, విద్వాంసులూ, సినిమావాళ్లూ!