"స్ఫూర్తిమంతులు....!"
మొన్న తగులబెట్టబడిన "రత్నాచల్" ఎక్స్ ప్రెస్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ లకి, "అవార్డు" ఇచ్చారట.....రైల్వే వాళ్లు! "సమయస్పూర్తి తో" ఫోను చేసి మరీ కరెంటు సప్లై ఆపి, ఇంజను మీదకెక్కిన వాళ్ల ప్రాణాలు కాపాడినందుకు. (నా బొందలో సమయస్ఫూర్తి.....నేనైతే, వాళ్ల వుద్యోగాలు పీకేసి వుండేవాడిని--కొన్ని కోట్ల క్రొత్త ఇంజనూ, ఒక్కోటీ కొన్ని లక్షల ఖరీదు చేసే 23 బోగీలూ తగులబెట్టడానికి దోహదం చేసినందుకు).
100 కీలోమీటర్ల వేగంతో వస్తూ.....ఓ కిలోమీటరు దూరం నుంచి జనాలని చూసి, సడెన్ బ్రేక్ వేస్తూ, జనాలకి కేవలం "5 మీటర్ల" దూరం లో రైలు ఆపగలిగినందుకు......యెగబడి వాణ్ని చితక్కొట్టేశారు....! (నేనైతే, వాడిని వెంటనే కంటిచూపు పరీక్షకి పంపించేవాణ్ని! రైల్వేలో అదో ఘోరమైన శిక్ష.....ఆ వంకతో డిస్ మిస్ చేసేస్తారు(ట)......ఆ తరువాత.....రిపోర్టులో కంటిచూపు 100% ఖచ్చితంగాలేదు అని వస్తుంది కాబట్టి!).
ఆ డ్రైవర్ ని నేనే అయితే, స్పీడుని తగ్గించుకుంటూ......"నా రైలు" కి ప్రమాదం జరగని స్టేజి వరకూ చూసుకుని, అదే స్పీడులో ముందుకి నడిపించేసేవాడిని.......తరువాత స్టేషన్ వరకూ......యెవరు బ్రతికారో, చచ్చారో లెఖ్ఖ చెయ్యకుండా!
యేమో.....తరువాత అన్ని కోట్ల రైలుని కాపాడినందుకు నాకు ఎవార్డ్ ఇచ్చేవారేమో......!
మహా అయితే, "నిర్లక్ష్యంగా" నడిపి, కొన్ని పదుల మంది ప్రాణాలు తీశానని, పనిష్మెంటు ఇచ్చేవారేమో! (తరువాత ఇంకెవడైనా 'రైల్ రోకో' అంటే చాలు, ఆమడదూరం పరిగెత్తేవారు!)
పాపం....."క్లియరెన్స్" ఉందికదా అని బండి నడిపి, ట్రాక్ పై పని చేస్తున్న గాంగ్ మెన్ లనీ, కూలీలనీ పొరపాటున రైలు గుద్దేస్తే, బాధ్యులందరితో పాటు డ్రైవర్ లకి కూడా పనిష్మెంట్ ఇవ్వడం లేదూ......అనేక కేసుల్లో? అలాంటి పనిష్మెంట్ నాకొచ్చినా సంతోషంగా స్వీకరించేవాడిని......భవిష్యత్తులో యెవరూ రైలుకి అడ్డంగా రాకుండా వుండేలా చేసినందుకు!
ఇప్పటికైనా, రైల్వే అధికారులు......ఇలాంటి సంఘటనల్లో....."రైలు ఆపడానికి ప్రయత్నించద్దు"......అని డ్రైవర్లకి ఆదేశాలివ్వాలి. రైల్వేల, "మన" ఆస్థుల్ని కాపాడాలి!
(నిజానికి......"అంబులెన్స్" గానీ, "ఫైర్ ట్రక్" గానీ యెవరినైనా గుద్దేసినా, కేసు లేదంటారు.....యెంతవరకూ నిజమో నాకు తెలీదు. ఇది అలాంటి వాటిని మించిన......కొన్ని వేలమంది......పెద్దా, చిన్నా, ముసలీ, ముతకా, వికలాంగ, రోగగ్రస్త వగైరా ప్రజల ప్రాణాలకీ, కొన్ని కోట్ల విలువైన "మన" ఆస్థులకీ సంబంధించిన వ్యవహారం! అందుకే ఇందులో యేమీ తప్పు లేదు!)
యేమంటారు.....?
(ఇది నేను ఆ "అవార్డు" గురించి వార్త చదివిన రోజున వ్రాసిన టపా. అందరూ 'వేడిలో' వుండగా ప్రచురించడం యెందుకులే అని ఆపాను. ఇప్పుడు ప్రచురించాను. నిర్మొగమాటం గా మీ అభిప్రాయాలని వ్రాయండి).
చాలా చక్కగాచెప్పారు.
ReplyDeleteప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి మార్పులు చేస్తేగాని దేశభవిష్యత్తు మంచి దిశలోకి వెళ్ళదు మరి.
మీరన్నది నిజం సుధాకర్! మార్పు రావలసిందే.
Deleteఏ విషయంలో ఐనా సరే తప్పు-ఒప్పు ఉంటాయి. కాని ఏది తప్పు , ఏది కాదు మాత్రమే ఎవరికీ తెలియదు. ఎవరికి వాళ్ళు, వాళ్ళు చేసినది ఒప్పు అనీ, ఇతరులది తప్పనీ అనుకుంటారు. కాలమే నిర్ణయించాలి. ఇందులోనూ అంతే!. డ్రైవర్లు చేసినది తప్పా, ఒప్పా అంటే చెప్పటం కష్టమే. కాని ఒక విషయం తప్పకుండా అనిపిస్తున్నది. దూరం నుంచే అక్కడ గుమిగూడిన జనం, గలాభా చూసి రైలు స్పీడు తగ్గించేసి, వెంటనే వెనక్కు వెళ్ళటం చెయ్యలేకపొయ్యారా అని. కానీ, రైల్వేలో పైనుంచి అనుమతి లేకుండా రైలును వెనక్కి నడపటం చాలా ఘోరమైన తప్పట మరి. అందుకనె రైలు ఎక్కడ ఉన్నది అక్కడే ఉంచారు. తరువాతి విషయం మనకు తెలుసు, పెద్ద బ్రేకింగ్ న్యూస్ కింద మీడియా ఆరోజు పబ్బం గడుపుకున్నది, ప్రజా ధనం కోట్లల్లో వృధా, రాజకీయ నిరుద్యోగులకు మంచి మైలేజీ వచ్చింది, కొన్ని రాజకీయ ఆత్మలకు శాంతి. ఒక వర్గానికి తీరని చెడ్డపేరు.
ReplyDeleteరైలు తగలబెట్టినవాళ్ళది, రైలు డ్రైవర్లను కొట్టిన వాళ్ళది మాత్రం తప్పే, వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నాసరే, నిస్సందేహంగా తప్పే.
మీరన్నది నిజమే శివగారూ! పై అధికారుల అనుమతి లేకుండా రైలు వెనక్కి నడపడం ఘోరమైన నేరమే.....కళేబరాలు ఇంజన్లో ఇరుక్కుపోయినప్పుడు, దెబ్బతిన్న ట్రాక్ మీదకి ఇంజన్ కొంత ఎక్కినప్పుడు--ఇలాంటి సమయాల్లో మాత్రం కొద్దిగా వెనక్కి నడపచ్చుట. అందుకే నేను...."రైలు ముందుకే నడిపించేసేవాణ్ని.....యెంతమంది యేమైనా సరే".....అని వ్రాశాను.
Deleteట్యూన్ స్టేషన్ మాష్టారు ఏమి చేస్తునట్టు! ఈ గోలంతా స్టేషన్ బయట కదా జరిగినది. ముందుగా మిగిలిన స్టేషన్లకు మెసేజీ పంపి, రైళ్ళను వదలకుండా చేసి ఉంటే? అక్కడ జరిగిన Time Line మనకు తెలియదు మరి. డ్రైవరు అంతమంది జనం గుమికూడి ఉండగా ఎప్పటికీ ముందుకు నడపదు, అలా నడపమని అనుమతి ఉన్నాసరే నడపలేడు.
Deleteపైన ట్యూన్ కాదు "తుని" అని చదువగలరు.
Deleteమీ అభిప్రాయం చక్కగా ఉంది. ఏకీభవిస్తున్నాను. ఏమైనా దీనిపై పార్లమెంటులో చర్చించి ఏదైనా చట్టం చేయాలి ఇటువంటి హీన చర్యలు జరపకుండా.
ReplyDeleteదీనికి పార్లమెంటు చట్టం చేయవలసిన అవసరం లేదండి. రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తే చాలు. మళ్లీ ఎవడూ రైలు బద్దీల దగ్గరకి పోరు.
Deleteఓ ట్రెయిన్ వెనక అదే లైన్ మీద కొద్ది దూరంలో వేరే ట్రెయిన్లు కూడా నడుస్తుండచ్చు కదా; అందువల్ల ముందు వెడుతున్న ట్రెయిన్ ఉన్నట్లుండి వెనక్కు నడవడం ప్రమాదకరం కదా.
ReplyDeleteమీరన్నదే కరెక్ట్ - ముందుకి నడిపించెయ్యడమే. కనీసం భవిష్యత్తులో "రైల్ రోకో" లు చేద్దామనుకునేవాళ్ళు కాస్తయినా భయపడతారు. ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అక్షరాలా కాల్చేసారు, ఎవడబ్బ సొమ్మని? రాజకీయ నాయకులు దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించగలరో అంత భ్రష్టూ పట్టించారు.
చాలా నెలల తర్వాత మళ్ళీ కనిపించారు మీరు. వెల్కం బాక్.
"...రాజకీయ నాయకులు దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించగలరో అంత భ్రష్టూ పట్టించారు..." ఒకే రాజకీయనాయకులు వెధవలు. ఆ వెధవలు చెప్పిన మాటలు విని రేచ్చిపోయి రైల్వే లైను మీదకి, రోడ్లమీదకి ఎగబడిన గుంపుల్లో ఉన్నది ప్రజలే కదా! వాళ్ళ బుద్ధి ఏమయ్యింది. తమ కులానికి రిజర్వేషన్లు అనంగానే వేర్రేక్కిపోవటమేనా? వెర్రెక్కి దుష్టపు పనులు చెయ్యటం, పాత పగలు దృష్టిలో పెట్టుకుని టార్గెట్ విధ్వంసం చెయ్యటం వంటివి చేసేదెవరు, "అమాయక" ప్రజలే! ప్రజలకి లేని బుద్ధి, రాజకీయనాయకులకి ఎక్కడనుంచి వస్తుంది. రాదు. ఆ తానులో గుడ్డలే కదా అందరూనూ.
Deleteమీకు తెలియనిదేముంది - జనాలు మందగా గుమిగూడినప్పుడు విచక్షణకి తావుండదు కదా. incite చెయ్యడం తేలిక. కులం పేరుతోను, మతం పేరుతోను, ప్రాంతం పేరుతోను రెచ్చగొట్టడం మరింత సులువు. అక్షరాశ్యత కూడా కొరవడితే ఇహ చెప్పక్కరలేదు. మన రాజకీయ నాయకులు ఇది తేలిక మార్గం అని ఏనాడో గ్రహించి వాడుకుంటూ దేశాన్ని భ్రష్టు పట్టించారు.
ReplyDeleteనిజమే నరసింహారావుగారూ!
Deleteఅయినా, యెవరో "ఇన్‌సైట్" చేస్తే, "అమాయక" ప్రజలు రెచ్చిపోరు! "అసలు" వాళ్లు....ప్రీప్లాన్‌డ్ గా వున్నవాళ్లు ముందు పరిగెట్టి, వాళ్ల పని కానిచ్చేస్తూంటే, ఆ సంగతి తెలియక వెనకే పరుగెట్టుకెళ్లి, బిత్తరపోయి, మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెడతారు. "అసలు" వాళ్లు మత్రం, అనేక చోట్ల వాళ్ల పని కానిచ్చేస్తూ వుంటారు.
ధన్యవదాలు.