"భ్రష్ట భయంకర" సంగీతం-3
ఈ చవితి పందిళ్లకి అనుమతులు ఇచ్చేవాళ్లూ, తీసుకునే వాళ్లూ ఒకలాగే వున్నారు.
స్కూళ్లకి సెలవలు ఇచ్చిన రోజుల్లో పగలూ రాత్రీ కూడా ఈ గోల తప్పలేదు. స్కూళ్లు తెరిచాక కూడా, మా వీధి పందిట్లో అంత సౌండ్ తోనూ పాటలు వేస్తూంటే, ఓ పోలీసాయన వచ్చాడు. వాళ్లు పాటలు ఆపేసి, "పూజలు ప్రారంభం అవబోతున్నాయి" అంటూ అనౌన్స్ చేశారు! ఆ పోలీసు, పెర్మిషన్ చెక్ చేసినట్టున్నాడు....."పూజలకి మైక్ వాడొచ్చు" అని వుందేమో.....వెళ్లిపోయాడు.
మరి మంత్రాలు అంత గట్టిగా వినిపించినా, స్కూళ్లకి యేమీ ఫరవాలేదు అని వాళ్ల భావమేమో! ఇంకా విచిత్రమేమిటంటే, పూజ అయిపోయాక మళ్లీ వెకిలిపాటల ప్రారంభం! స్కూళ్ల దారి స్కూళ్లదే.....!
ఇదివరకు ఇళ్లలో పూజ చేసుకునేవాళ్లు, ఆ సాయంత్రమే ఉద్వాసన చెప్పేసేవారు. పందిళ్లలో, నవరాత్రులూ అయ్యాక చేశేవారు. నిమజ్జనాలు లేవు.
ఇప్పుడు యే శాస్త్రం లోంచి పట్టుకొచ్చారోగానీ, 11 రోజులు వుంచి, ఆ తరువాత నిమజ్జనం ట!
మా వీధి వాళ్లకి చందాలు తగ్గాయో, కాళ్లు చల్లబడ్డాయో గానీ, నాలుగో రోజునే నిమజ్జనం చేసేశారు.
దాంతో బయటపడ్డాం......ఈ శ్రవణ హింస నుంచి!
జై జై వినాయక!
(.....మరో సారి)